Thursday, January 23, 2025

రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజ్యసభ ఎంపీగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి గురువారం ప్రమాణం చేశారు. ఆమె భర్త నారాయణమూర్తి సమక్షం లోనే ఈ కార్యక్రమం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన ఛాంబర్లో ఆమెతో ప్రమాణం చేయించారు. సభా నాయకుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 73 ఏళ్ల సుధామూర్తి గతంలో ఇన్ఫోసిస్ ఛైర్మన్‌గా పనిచేశారు.

ఆమె పిల్లల కోసం అనేక పుస్తకాలు రాశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేసింది. కన్నడ, ఆంగ్ల సాహిత్యంలో ఆమె అనేక రచనలు చేశారు. సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, పద్మశ్రీ (2008), పద్మభూషణ్ (2023) అవార్డులను అందుకున్నారు. టెల్కో కంపెనీలో పనిచేసిన తొలి మహిళా ఇంజినీర్‌గా సుధామూర్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రూ. 10 వేల పెట్టుబడితో ప్రారంభించిన ఇన్ఫోసిస్ కంపెనీ ప్రస్తుతం 80 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అయిన అక్షత సుధామూర్తి కుమార్తె అన్నది తెలిసిందే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News