Friday, January 24, 2025

సుధాకర్ రెడ్డి ఎఎజి కంటే వైసిపి కార్యకర్త అని చెప్పుకోవడం మేలు: ఆనం

- Advertisement -
- Advertisement -

అమరావతి: న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ సక్రమంగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులో ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సుధాకర్ రెడ్డి ప్రభుత్వ లాయర్‌గా తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నారని చురకలంటించారు. జగన్ ద్వారా పునర్జన్మ పొందానని పొన్నవోలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఎఎజి అయినా సేవలు జగన్‌కేనని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వసతులు, జీతభత్యాలు పొందుతూ జగన్‌కు సేవకుడినని చెబుతారా? అని ఆనం నిలదీశారు. సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలపై అత్యున్నత జడ్జిలు, బార్ కౌన్సిల్ స్పందించాలని కోరారు. ఒక వ్యక్తికి సేవ చేసుకుంటాననే వ్యక్తి ప్రజలకు ఎలా సేవ చేస్తారని ప్రశ్నించారు. సుధాకర్ రెడ్డి ఎఎజి కంటే వైసిపి కార్యకర్త అని చెప్పుకోవడం మేలని తెలిపారు. సుధాకర్ రెడ్డి వంటి వారి వల్ల న్యాయం, చట్టంపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత ఎనిమిది మందికి వ్యక్తిగత భద్రత ఎందుకు పెంచుకున్నారని ఆనం అడిగారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు భద్రతకు లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత అరెస్టు, రిమాండ్‌పై సిఎం జగన్ మోహన్ రెడ్డి నోరు మెదపకపోవడం దారుణమని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News