Wednesday, January 22, 2025

నాకింద దొంగలున్నారు… వారికి నేనే సర్దార్ :

- Advertisement -
- Advertisement -

Sudhakar Singh's comments became controversial

బీహార్ మంత్రి సుధాకర్ సింగ్ కీలక వ్యాఖ్యలు

పాట్నా : బీహార్ మంత్రి ఆర్జేడీ నేత సుధాకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన శాఖలో ఎంతోమంది దొంగలున్నారని, వారికి తానే సర్దార్ అంటూ ఆయన మాట్లాడిన తీరు ఆ రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. అక్కడితో ఆగకుండా తనపైన కూడా సర్దార్లు ఉన్నారంటూ జేడీయూ , ఆర్జేడీ అగ్రనేతలను వివాదం లోకి లాగారు. నా వ్యవసాయ శాఖలో చోరీకి పాల్పడని విభాగం ఒక్కటే లేదు. ఆ శాఖ నా నేతృత్వంలోనడుస్తోంది. కాబట్టి వారందరికీ నేను సర్దార్‌ను. నాపైన ఎంతోమంది సర్దార్లు ఉన్నారు. ప్రభుత్వం మారింది. పనిచేసే తీరు మాత్రం అదే. అంతా గతంలో వలే ఉంది. అంటూ నితీశ్ కుమార్ నేతృత్వం లోని ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శనాత్మకంగా స్పందించారు. బీహార్ విత్తన సంఘంలో జరుగుతోన్న అవినీతిని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులను ఆదుకుంటామని చెప్తూ ఆ సంఘం రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. 2013 లో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయనపై బియ్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలుండటం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News