Thursday, January 23, 2025

రాజ్యసభకు సుధామూర్తి

- Advertisement -
- Advertisement -

మహిళా దినోత్సవం రోజున ఓ అద్భుతం జరిగింది. ప్రముఖ సమాజ సేవకురాలు, విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సుధామూర్తి నియామకాన్ని ప్రశంసిస్తూ ఎక్స్ లో కామెంట్  చేశారు. ‘సమాజ సేవ, విద్యారంగం, దాతృత్వం వంటి విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన కృషి అపారం. ఆమె నియామకం నారీశక్తికి చక్కటి నిర్వచనం’ అని ప్రధాని ప్రశంసించారు.

సుధామూర్తి వయసు 73 సంవత్సరాలు. విద్యావేత్తగా, సమాజ సేవకురాలిగా ఎంతో పేరు గడించారు. ఆమెకు 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News