Monday, January 20, 2025

ఆ బలం ప్రతిపక్ష పార్టీలకు లేదు..

- Advertisement -
- Advertisement -

Sudhanshu Trivedi takes Swipe at Opposition Unity

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సాగిస్తున్న ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలను బిజెపి ఎద్దేవా చేసింది. ఇవి తమ ప్రత్యర్థుల అంతర్గత వ్యవహారాలు అయినప్పటికీ తమ సొంత రాజకీయ ఇమేజ్‌ను పెంచుకోవడానికే ప్రత్యర్థ పార్టీలు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయంటూ బిజెపి అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ అయినా, నితీశ్ కుమార్ అయినా, కె చంద్రశేఖర్ రావు అయినా లేక కాంగ్రెస్ అయినా.. వీరెవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్ధం కాని బలం కాని లేవని బిజెపి రాజ్యసభ సభ్యుడు కూడా అయిన త్రివేది వ్యాఖ్యానించారు. తమ సొంత రాజకీయ ఇమేజ్‌ను పెంచుకోవడమే వారి అసలు లక్షమని ఆయన ఆరోపించారు. కుల, మత, భాష, ప్రాంతాల చుట్టూ నిర్మించుకున్న విచ్ఛిన్నకర వోటు బ్యాంకు రాజకీయాలతో భారతీయ సమైక్యతను, భారతీయతను, భారతీయ సంస్కృతిని కాంగ్రెస్ నాశనం చేసిందని ఆయన ఆరోపించారు.

Sudhanshu Trivedi takes Swipe at Opposition Unity

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News