Monday, December 23, 2024

‘జటాధర’ ఫస్ట్ లుక్.. పవర్‌ఫుల్ అవతార్‌లో సుధీర్ బాబు

- Advertisement -
- Advertisement -

వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో శివన్ నారంగ్, ప్రేరణా అరోరా నిర్మిస్తున్న మూవీతో నవ దళపతి సుధీర్ బాబు సూపర్ నేచురల్ ఫాంటసీ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీకి ‘జటాధర’ అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్ సుధీర్ బాబుని పవర్‌ఫుల్, స్ట్రాంగ్ అవతార్‌లో చూపించింది. అతను తన చేతిలో త్రిశూలంతో శివుని రూపం ముందు నిలబడి ఉన్నారు. సిక్స్-ప్యాక్‌తో మాచోలా కనిపిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. జటాధర సినిమా 2025 మహాశివరాత్రికి గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News