Saturday, December 21, 2024

ఇది నాకు ఒక ఛాలెంజ్.. (సుధీర్ బాబు ఇంటర్వ్యూ)

- Advertisement -
- Advertisement -

నైట్రో స్టార్ సుధీర్ బాబు యాక్టర్, ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మామా మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబుతో మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
కొత్త అనుభూతినిచ్చే…
దర్శకుడు హర్ష చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. చాలా డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది. మనం, గుండెజారే గల్లంతయ్యిందే చిత్రాలతో తను మంచి రైటర్‌గా నిరూపించుకున్నారు. తనకి సినిమాలపై మంచి పట్టువుంది. ‘మనం’ చూసినప్పుడు ఎంత కొత్తగా అనిపించిందో.. మామా మశ్చీంద్ర సినిమా చూసినప్పుడు కూడా అలాంటి కొత్త అనుభూతినిస్తుంది.
ఇది నాకు ఒక ఛాలెంజ్..
మామ మశ్చీంద్ర మూవీలో ట్రిపుల్ రోల్‌ని ఒక అవకాశంగా భావించాను. ఇందులో మూడు పాత్రలకు మూడు డిఫరెంట్ యాసలు వుంటాయి. ఒక పాత్ర తెలంగాణ, మరొకటి ఉత్తరాంద్ర, ఇంకో పాత్రకు రాయలసీమ యాస వుంటుంది. ప్రతి పాత్రకు వేరియేషన్ వుంది. ఒక పాత్ర కోసం బరువు పెరిగాను. మరో పాత్రకు ప్రోస్తటిక్స్ వాడాం. యంగ్‌గా కనిపించే పాత్ర కోసం డైట్ రొటీన్ పాటించాను. ఈ చిత్రం మెంటల్‌గా, ఫిజికల్‌గా ఒక ఛాలెంజ్.
ఆద్యంతం కథ ఆసక్తికరంగా…
మామా మశ్చీంద్ర… మల్టీ లేయర్ వున్న కథ. సెంట్రల్ లేయర్ పరశురాం పాత్ర. పరశురాం జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనలో జైలుకి కూడా వెళ్తాడు. బయటికి వచ్చిన తర్వాత తన జర్నీ ఎలా వుంటుంది ? తన పాత్ర మిగతా పాత్రలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది ? తన జీవితాన్ని మార్చింది ఎవరు ? ఇలా చాలా కోణాల్లో కథ ఆసక్తికరంగా సాగుతుంది.
తను చక్కని నటి…
ఈషా రెబ్బా తెలుగమ్మాయి. తెలుగు వాళ్ళతో పని చేయడంలో చాలా సౌకర్యం వుంటుంది. తను చక్కని నటి. మృణాలిని కూడా తెలుగు నేర్చుకొని చక్కగా నటించింది. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం వుంది.
నెక్స్ ప్రాజెక్ట్…
మా నాన్న సూపర్ హీరో సినిమా డబ్బింగ్ స్టేజ్ లో వుంది. అలాగే నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘హరోం హర’ కూడా రూపొందుతోంది. గోపీచంద్ బయోపిక్ ఖచ్చితంగా వుంటుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News