Saturday, December 21, 2024

‘మామా మశ్చీంద్ర’ సుధీర్ బాబు డీజే లుక్ విడుదల

- Advertisement -
- Advertisement -

నైట్రో స్టార్ సుధీర్ బాబు వరుస సర్ప్రైజ్‌లతో వస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన, నటుడు-దర్శకుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన మామా మశ్చీంద్ర లో సుధీర్ బాబు మూడు విభిన్న లుక్స్ లో కనిపించనున్నారు.

ఊబకాయం ఉన్న దుర్గ, ఓల్డ్ డాన్ పరశురామ్ క్యారెక్టర్ పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. డిజె క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా మూడవ సర్ ప్రైజ్ తో వచ్చారు. టీ-షర్ట్, రిప్డ్ జీన్స్ ధరించి, హెడ్‌సెట్‌తో పూర్తిగా పారవశ్యంలో కనిపిస్తున్నారు. మొదటి రెండు గెటప్‌లలో డీ-గ్లామ్ లుక్స్‌లో కనిపించగా, మూడో లుక్‌లో డీజేగా తన రిథమ్‌తో మనసుల్ని దోచుకునేలా కనిపించాడు.

తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు నటించారు, అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News