Wednesday, January 22, 2025

సూపర్ నేచురల్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో మెప్పిస్తోన్న నవ దళపతి సుధీర్ బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ చిత్రం 2025 శివరాత్రి విడుదలకు సన్నద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతోంది. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కలయికగా ఈ చిత్రం తెరకెక్కుతోందని విడుదలైన పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే అందులో సుధీర్ బాబు సరికొత్త లుక్‌తో, శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.

నవ దళపతి సుధీర్ బాబు మాట్లాడుతూ “ఈ సినిమాలోకి అడుగు పెట్టటం అనేది ఓ సరికొత్త ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది. నాకు ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. శాస్త్రీయత, పౌరాణిక అంశాల కలయికగా స్క్రిప్ట్‌ను రాశారు. ఈ రెండు జోనర్స్‌కు చెందిన ప్రపంచాలను ఆడియెన్స్ వెండితెరపై చూస్తున్నప్పుడు ఓ సరికొత్త సినిమా అనుభూతిని పొందుతారు” అని అన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News