Wednesday, January 22, 2025

ఇంద్రగంటితో చేయడం అదృష్టంగా భావిస్తున్నా

- Advertisement -
- Advertisement -

నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి.మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో హీరో సుధీర్ బాబుతో మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
అదృష్టంగా భావిస్తున్నా…
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్‌లో ఒక ఒక డైలాగ్ ఉంది. ‘మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం. కానీ సినిమానే మనల్ని తీస్తుంది’అని. వాస్తవానికి మా కాంబినేషన్ వలన ఈ సినిమా జరగలేదు. సినిమానే మమ్మల్ని ఎంపిక చేసుకుంది. ఆయన నన్ను యాక్టర్ గా నమ్మారు. నేను ఆయన కథల్ని నమ్మాను. ఆయన ఒక కాంబినేషన్ ని సెట్ చేసుకోవాలనుకునే దర్శకుడు కాదు. ఒక హిట్ ఇచ్చిన వెంటనే ఒక పెద్ద స్టార్ కోసం ఎదురుచూస్తారు. కథలు రాస్తారు. కానీ ఆయన మాత్రం ఒక కథని రాసుకొన్న తర్వాత దానికి ఎవరు నప్పుతారో చూస్తారు. ఆయన నాతో సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నా.
వైవిధ్యంగా డిజైన్ చేశారు…
ఇంద్రగంటి సినిమాల్లో ఎమోషన్ చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ పాత్రలతో ప్రయాణిస్తారు. ఇందులో కమర్షియల్ సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపిస్తా. ఆ పాత్రకి కొంచెం తిక్క, భిన్నమైన అభిరుచి వుంటుంది. ఇంద్రగంటి ఈ పాత్రని చాలా వైవిధ్యంగా డిజైన్ చేశారు.
అన్నీ అద్భుతంగా…
ఇంద్రగంటి సినిమాల్లో ఇంట్రో సాంగ్, ఐటెం సాంగ్ సాధారణంగా ఉండవు. అయితే ఈ కథలో నా పాత్ర కమర్షియల్ డైరెక్టర్ కావడం వలన ఆ అవకాశం వచ్చింది. ఐటెం సాంగ్ చేయడం వివేక్ సాగర్ కి కూడా కొత్త. వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలు, నేపధ్య సంగీతం అన్నీ అద్భుతంగా వుంటాయి.
చాలా పరిణితి కనబరుస్తుంది…
కృతిశెట్టి చాలా మంచి నటి. ఒక పాత్రని అర్ధం చేసుకోవడంలో చాలా పరిణితి కనబరుస్తుంటుంది. ఈ సినిమాతో ఆమె ఏ పాత్రనైనా చేయగలననే నమ్మకం కలిగిస్తుందని భావిస్తున్నా. శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా వుంటాయి.
దర్శకత్వం వైపు ఆసక్తి ఏర్పడింది…
నేను చాలా మంది కొత్త దర్శకులతో పని చేశా. నాకు తెలియకుండానే దర్శకులు చేసే కొన్ని పనులు చేశాను. తప్పని పరిస్థితుల్లో ఏవో సీన్స్, డైలాగ్స్ రాయడం, షూటింగ్ చూసుకోవడం వంటి పనులు చేయడంతో అనుకోకుండానే దర్శకత్వం వైపు ఒక ఆసక్తి ఏర్పడింది. అయితే దర్శకత్వం ఎప్పుడు చేస్తానో తెలీదు. ఇప్పటికైతే నా దృష్టి నటనపైనే వుంది.
‘బ్రహ్మాస్త్ర’ ఆఫర్ వచ్చింది…
బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఆఫర్ నాకు వచ్చింది. కానీ ఆ సమయంలో ‘సమ్మోహనం’ చేస్తున్నా. అలాగే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చర్చల్లో ఉండటం వలన చేయడం కుదరలేదు.
తదుపరి చిత్రాలు…
హంట్, మామామశ్చీంద్ర, యూవీ క్రియేషన్స్ సినిమా, అలాగే సెహరి దర్శకుడు జ్ఞానసాగర్ తో ఓ సినిమా చేస్తున్నా. ‘మామామశ్చీంద్ర’ ఇంకో 20 రోజులు షూట్ వుంది. హంట్ సినిమాకి మార్వెల్ సిరిస్‌కి చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ పని చేశారు.

Sudheer Babu Special interview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News