Monday, December 23, 2024

‘హంట్’ చూసిన వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు…

- Advertisement -
- Advertisement -

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ నివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అప్రిసియేషన్ లభిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ ”సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ‘హంట్’ స్టార్ట్ చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాం. ఫ్యాన్స్ కానీ, రెగ్యులర్ కంటెంట్ చూసే వాళ్ళు గానీ ఏమంటారో అనుకున్నాం. ప్రేక్షకులు అందరూ సెకండాఫ్ లో 30 మినిట్స్ ఎక్సట్రాడినరీ అని చెబుతున్నారు. శని, ఆది వారాలు అయితే కలెక్షన్స్ అనౌన్స్ చేస్తాం. సోషల్ మీడియాలో చాలా మంది సినిమాను అప్రిషియేట్ చేస్తూ పోస్టులు చేశారు. ఆడియన్స్ చాలా మంది మెసేజ్ లు చేశారు. వాళ్ళందరికీ థాంక్స్. ఇది డిఫరెంట్ ఫిల్మ్. ఒక్కటి చెబుతా… నేను అయితే రెగ్యులర్ సినిమాలు చేయను. ఇప్పటి వరకు చేసినవి అన్నీ డిఫరెంట్ సినిమాలే. ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్ సినిమా. థియేటర్లలో సినిమా చూడండి” అని అన్నారు.

దర్శకుడు మహేష్ మాట్లాడుతూ ”జనవరి 26న మా సినిమా ‘హంట్’ విడుదలైంది. క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ చాలా బావుంది. కమర్షియల్ రెస్పాన్స్ వీకెండ్ తర్వాత తెలుస్తుంది. డేరింగ్ అటెంప్ట్ అని ఆడియన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. హీరో సుధీర్ బాబు గారు ధైర్యంగా ఆ రోల్ చేశారు. 75 శాతం మంది ఆయన అటువంటి రోల్ చేసినందుకు మెచ్చుకుంటున్నారు. నేను ఎప్పటికీ గర్వపడే సినిమా. తెలుగులో ఇటువంటి సినిమా చేయడం తొలిసారి. ఎంపతీ క్రియేట్ చేయడానికి భరత్ సార్ క్యారెక్టర్ చాలా ఉపయోగపడింది. మా సినిమాలో నటించినందుకు ఆయనకు థాంక్స్. సుధీర్ బాబు గారికి హ్యాట్సాఫ్. కమర్షియల్ స్పేస్ లో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేసే ఏ హీరో కూడా ఇటువంటి క్యారెక్టర్ చేయరు. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనే తపన ఎంతో ఉంటే తప్పితే చేయరు. ఈ సక్సెస్ క్రెడిట్ ఆయనదే. భవ్య క్రియేషన్స్ ఆనంద ప్రసాద్ గారు, రవి గారు కూడా ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమా ప్రేక్షకులకు అందించాలని మాకు ఎంతో అండగా నిలబడ్డారు. ఇటువంటి సినిమా చూసే అవకాశం అరుదుగా వస్తుంది. థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. మిమ్మల్ని డిజప్పాయింట్ చేయం. థాంక్యూ ఆల్” అని అన్నారు.

భరత్ మాట్లాడుతూ ”తెలుగు ప్రేక్షకుల ముందుకు స్ట్రెయిట్ సినిమాతో రావడానికి కొన్నేళ్ళు టైమ్ తీసుకున్నా… మంచి సినిమా చేశా. సరైన సినిమా చేశా. కంటెంట్ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు సరైన చిత్రమిది. కమర్షియల్ వేల్యూస్ తో సినిమా తీశాం. మహేష్ కెరీర్ లో ఇదొక మంచి సినిమా. సుధీర్ బాబు కొత్తగా ట్రై చేశారు. ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన భవ్య క్రియేషన్స్ సంస్థకు థాంక్స్” అని అన్నారు.

సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ మాట్లాడుతూ ”సినిమాకు లభిస్తున్న స్పందన పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం. కొత్తది అటెంప్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ‘పలాస’ తర్వాత తెలుగులో నేను చేసిన చిత్రమిది. సుధీర్ బాబు గారు, శ్రీకాంత్ గారు, భరత్… ముగ్గురు హీరోలు అద్భుతంగా నటించారు. సుధీర్ బాబు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు. సినిమాలో హీరోయిన్ లేదనే ఫీలింగ్ ఎవరికీ ఉండదు. రెస్పాన్స్ బావుంది. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారు. అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది రావాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News