Monday, January 20, 2025

పీరియాడిక్ యాక్షన్ డ్రామా

- Advertisement -
- Advertisement -

Sudheer Babu's 18th Movie Announced

నైట్రో స్టార్ సుధీర్ బాబు 18వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘సెహరి’ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సినిమా చేయనున్నారు సుధీర్ బాబు. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సౌత్ బొంబాయికి చెందిన అరుణ్ గౌలి నుండి చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రమణ్యంకు వచ్చిన ఇన్‌ల్యాండ్ లెటర్ కార్డ్ కనిపిస్తుంది. ”క్రిటికల్: నీ రాక అవసరం.‘అనే మెసేజ్ కూడా కార్డ్ పై వుంది. తుపాకీ, బుల్లెట్‌లు, పాత ఐదువందల రూపాయి నోటు, ల్యాండ్‌లైన్ ఫోన్, సిగార్‌తో పాటు పోస్టర్‌లో దేవాలయం, గ్రామ వాతావరణం కనిపిస్తుంది. అక్టోబరు 31న మాస్ సంభవం అని ఆ రోజు వచ్చే అప్‌డేట్ ని గురించి పోస్టర్‌లో సూచించారు మేకర్స్. సుధీర్ బాబు 18 అనేది దైవిక అంశంతో కూడిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ కథ 1989లో కుప్పంలో జరుగుతుంది. ఇది సరైన నేటివిటీ చిత్రం. ఇది సుధీర్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో చూపిస్తుంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు.

Sudheer Babu’s 18th Movie Announced

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News