Monday, December 23, 2024

పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం..

- Advertisement -
- Advertisement -

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ నిర్మించనున్నారు. ఈ సినిమా కూకట్‌పల్లిలోని భవ్యాస్ సముదాయంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఇందులో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం” అని తెలిపారు. సుధీర్ బాబు మాట్లాడుతూ పూర్తి స్థాయి యాక్షన్ చిత్రమిదని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అరుల్ విన్సెంట్, కళ: వివేక్, కూర్పు: ప్రవీణ్ పూడి, దర్శకత్వం: మహేష్.

Sudheer Babu’s New Movie Launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News