Monday, December 23, 2024

రూరల్ సిఐగా సుధీర్

- Advertisement -
- Advertisement -
  • జిల్లాలో 8 మంది సిఐల బదిలీ
  • 51 మంది ఎస్‌ఐలకు స్థాన చలనం

సంగారెడ్డి: జిల్లాలో 8 మంది పోలీస్ సిఐలు, 51మంది ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. మల్టీ జోన్ ఐజి 2 ఆదేశాల ప్రకారం జిలా ఎస్‌పి రమణకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి రూరల్ సిఐగా వైయిటింగ్‌లో ఉన్న సుధీర్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న సిఐ శివలింగం కొద్ది రోజుల క్రితం బదిలీ అయ్యారు. నల్గొండ విఆర్‌లో చంద్రయ్యను కొండాపూర్ సిఐగా బదిలీ చేయగా, కొండాపూర్‌లో ఉన్న సంతోష్ కుమార్‌ను సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ హేమారాణిని సంగారెడ్డిలోని కంట్రోల్ రూంకు పోస్టింగ్ ఇచ్చారు. కంట్రోల్ రూంలో ఉన్న రాందేవ్‌రెడ్డిని ఐజి కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.వెయిటింగ్‌లో ఉన్న ఎం రవీందర్‌రెడ్డిని బిడిఎల్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. సంగారెడ్డి ట్రాఫిక్ ఎస్‌హెచ్‌గా ఉన్న రాజును జహీరాబాద్ టౌన్ సర్కిల్‌కు బదిలీ చేశారు.డిటిసి సిఐ నాగరాజును సంగారెడ్డి ట్రాఫిక్‌కు బదిలీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News