Monday, December 23, 2024

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కు ఆరో స్వర్ణం

- Advertisement -
- Advertisement -

Sudhir get gold medal in common wealth games

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత దేశం ఆరో స్వర్ణం దక్కించుకుంది. దీంతో ఏడు రతజం, ఏడు కాంస్య, ఆరు స్వర్ణాలతో మొత్తం పతకాలు 20కి చేరాయి. పురుషుల పారా హెలీ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో సుధీర్ స్వర్ణం గెలుచుకున్నాడు. 134.5 పాయింట్లతో సుధీర్ స్వర్ణం సాధించగా నైజీరియాకు చెందిన క్రిష్టియన్ 133.6 పాయింట్లతో రజతంలో సరిపెట్టుకున్నాడు. సుధీర్ మొదటి సారి 208 కిలోలు, రెండో సారి 212 కేజీలు ఎత్తి 134.5 పాయింట్లు సాధించాడు. సుధీర్ పతకం సాధించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి శుభాక్షాంక్షలు తెలిపారు. గతంలో ఆసియాన్ పారా గేమ్స్‌లో సుధీర్ రజతం గెలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News