- Advertisement -
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాలోడు’. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించింది. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా హీరో సుధీర్ మీడియాతో మాట్లాడుతూ.. “ఊరిలో పనీ పాట లేకుండా తిరిగే వ్యక్తి సమస్యల్లో పడి సిటీకి రావడం, మళ్లీ సిటీలో ఇంకో సమస్యలో చిక్కుకోవడం, ఈ మధ్యలో ప్రేమ కథ ఉంటుంది. చిన్న చిన్న టిస్టులతో మంచి మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా నడుస్తుంది. కథకు తగ్గట్టుగానే ఈ సినిమా టైటిల్‌ను పెట్టాం. కాలేజ్‌లో గాలోడు చేష్టలు చేస్తుంటాడు. ఈ పాత్రను చూస్తేనే గాలోడులా అనిపిస్తుంది. సినిమా టీజర్, ట్రైలర్ వచ్చిన తర్వాత చాలా మంది ప్రశంసలు కురిపించారు” అని అన్నారు.
Sudigali Sudheer about Gaalodu Movie
- Advertisement -