Sunday, November 3, 2024

సుదిర్మన్ కప్.. భారత్ ఇంటికి

- Advertisement -
- Advertisement -

సూజో (చైనా): ప్రతిష్టాత్మకమైన సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ కప్ టోర్నమెంట్ నుంచి భారత్ నిష్క్రమించింది. సోమవారం మలేసియాతో జరిగిన రెండో పోరులో భారత్ 0-5 తేడాతో పరాజయం పాలైంది. ఆదివారం చైనీస్ తైపీతో జరిగిన తొలి పోరులో కూడా భారత్‌కు ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. మలేసియా, ఆస్ట్రేలియా, చైనీస్ తైపీలతో కలిసి భారత్ గ్రూప్‌సిలో తలపడింది.

చైనీస్ తైపీ, మలేసియాలతో జరిగిన పోరులో ఓటమి పాలు కావడంతో సుదిర్మన్ కప్‌లో భారత్ పోరాటం ముగిసింది. మలేసియాతో జరిగిన ఐదు మ్యాచుల్లోనూ భారత్‌కు ఓటమి ఎదురైంది. తొలి మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిలా అశ్విని పొన్నప్ప జోడీ పరాజయం చవి చూసింది. మలేసియాకు చెందిన గో సూన్‌లై షెవాన్ జంట చేతిలో భారత జోడీకి చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ నిరాశ పరిచాడు.

లీ జీతో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పి.వి.సింధు పరాజయం చవిచూసింది. గో జీన్ వితో జరిగిన పోరులో సింధుకు ఓటమి ఎదురైంది. తర్వాత జరిగిన పురుషుల డబుల్స్‌లో చిరాగ్ షెట్టిసాత్విక్ సాయిరాజ్ జోడీ పరాజయం పాలైంది. మహిళల డబుల్స్‌లో కూడా భారత్‌కు నిరాశే ఎదురైంది. త్రిషాగాయత్రి కూడా ఓటమి పాలు కావడంతో భారత్ ఇంటిదారి పట్టక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News