Monday, December 23, 2024

అంత్యోదయ కార్డులకు చక్కెర

- Advertisement -
- Advertisement -

5.99 లక్షల మందికి లబ్ది
ప్రతినెల 599 మెట్రిక్ టన్నుల పంపిణీ
రాయితీ ద్వారా కిలో రూ.13.50కే విక్రయం

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అంత్యదోయ అన్న యోజన రేషన్ కార్డు కలిగి ఉన్న ఉన్న లబ్దిదారులకు శుభవార్త తెలిపింది. పౌరసరఫరాల శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో అత్యోదయ అన్న యోజన పధకం (ఎఎవై) 5.99లక్షల రేషన్ కార్డులు ఉన్న లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుంది.ఈ పధకం కింద ప్రతినెల 599 మెట్రిక్ టన్నల చక్కెరను ప్రభుత్వం రేషన్ డీలర్లద్వారా పంపిణీ చేయనుంది. అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డులు ఉన్నవారికి ఉగాది పండగ సందర్భంగా ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎవైవై రేషన్ కార్డు ఉన్నవారికి మరింత లబ్ది చేకూరనుంది.

కేంద్ర ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం అంత్యోదయ అన్న యోజన(ఎఎవై) పథకాన్ని అమలు గత కొన్నేళ్లుగా ఆమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన వారికి నెలనెలా ఒక్కో కుటుంబానికి సబ్సిడీపై 35 కిలోల బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేయడం జరుగుతోంది. వీటితోపాటు వారికి చక్కెర కూడా పంపిణీ చేస్తారు. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రేషన్ డీలర్లు అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డు ఉన్నవారి బియ్యం, గోధుమలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. చక్కెర మాత్రం ఇవ్వడం లేదు. కొందరు డీలర్లయితే పౌరసరఫరాల సంస్థ నుంచి చక్కెర పొందేందుకు డిడిలే తీయకుండా ఉంటున్నారు.

మరికొందరు డి.డిలు తీసినా చక్కెర రాలేదని సాకులు చెబుతున్నారు. ఈ విషయం పౌరసరఫరాల శాఖ దృష్టికి చేరింది. దాంతో వెంటనే స్పందించిన పౌరసరఫరాల శాఖ రేషన్ డీలర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలవారీగా అవసరమైనంత చక్కెర తీసుకుని అత్యోదయ అన్న యోజన పథకం కింద రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఇకపై అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు ఉన్నవారికీ చక్కెర అందనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.99 లక్షల మంది ఏఏవై రేషన్‌కార్డుదారులు ఉన్నారు. కార్డుకు ఒక కిలో చక్కెర చొప్పున ప్రతి నెలా 599 మెట్రిక్ టన్నుల చక్కెర అవసరం పడుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ప్రతినెల చక్కెర నిల్వలు ఉంచాల్సి ఉంది.

రేషన్ డీలర్లు తమ పరిధిలో ఉన్న కార్డుల అవసరం మేరకు చక్కెర కొనుగోలు కోసం ముందుగానే పౌరసరఫరాల సంస్థకు డి.డిలు అందజేసి చెక్కర కోటాను తీసుకు పోవాల్సివుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 17,235 మంది డీలర్లు ఉన్నారు. ఈ నెల ఒకటి నుంచే కార్డు దారులకు బియ్యం సరఫరా మొదలైనప్పటికీ.. చాలా దుకాణాల్లో చక్కెర పంపిణీ జరగట్లేదు. వాస్తవానికి.. డీలర్లు రేషన్ కార్డుదారులకు బియ్యం, గోధుమలు, చక్కెర తదితర నిత్యావసర సరుకుల పంపిణీలో ఏమేం సరుకులు ఇచ్చారు.. ఎంతిచ్చారు అన్నది ప్రింట్‌తీసి ఇవ్వాల్సివుండగా, చాలా రేషన్ దుకాణాల్లో ఈ ప్రింట్లు ఇవ్వడం లేదు. మార్కెట్‌లో చక్కెర కిలో ధర రూ. 40నుండి -45 వరకు ఉంది.

అత్యోదయ అన్న యోజన పధకం కింద కార్డు ఉన్నవారికి సబ్సిడిపై కిలో చక్కెర రూ.13.50లకే అందించాలి. కొందరు డీలర్లు సరుకుల పంపిణీలో ప్రతినెలా లబ్దిదారలకు బియ్యంతో సరిపెట్టి చక్కెరను ఇవ్వటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఎన్నికల సంఘం అనుమతి మేరకు పౌరసరఫరాల శాఖ ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే చక్కర పంపిణీ అమల్లోకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News