Wednesday, January 22, 2025

భలే జోడీ: సుహాస్ పక్కన హీరోయిన్ గా మహానటి! 

- Advertisement -
- Advertisement -

కమెడియన్ గా వచ్చి అడపాదడపా హీరోగా నటించిన యాక్టర్లు చాలామందే ఉన్నారు. ఒకప్పటి కమేడియన్  రాజబాబు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత అలీ, సునీల్ వంటివారు హీరోలుగా తమను తాము నిరూపించుకున్నారు. ఇప్పుడు సుహాస్ కూడా హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సుహాస్ షార్ట్ ఫిలిమ్స్  తో కెరీర్ మొదలుపెట్టి, కమెడియన్ గా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కలర్ ఫోటో మూవీతో తనలో హీరో మెటీరియల్ ఉందని నిరూపించుకున్నాడు. ఇటీవల విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీతో పాజిటివ్ టాక్ సంపాదించుకున్నాడు.

సుహాస్ హీరోగా మరో మూవీ తెరకెక్కుతోంది. దీని పేరు ‘ఉప్పు కప్పురంబు’! ఈ మూవీలో సుహాస్ ఓ స్టార్ హీరోయిన్ తో జత కడుతున్నాడు. ఆమె మరెవరో కాదు.. మహానటి ఫేమ్ కీర్తి సురేశ్! అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తున్న ఈ మూవీ డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. ఐవి శశి దర్శకత్వంలో రాధికా లావు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News