Monday, December 23, 2024

సుహాస్ ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్ లుక్ లాంచ్

- Advertisement -
- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతున్న వెరీ టాలెంటెడ్ సుహాస్ తన చిత్రాల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ యూనిక్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం సుహాస్ చేస్తున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. ఈ చిత్రానికి శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఫ్యాన్ మేడ్ ఫిలింస్ బ్యానర్‌పై బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జెఎస్‌ నిర్మిస్తున్నారు.

ఇప్పుడు విడుదలైన ఈ  సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో సుహాస్ ని ‘కేబుల్ రెడ్డి’ గా టైటిల్ రోల్ లో ప్రెజెంట్ చేసింది. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ సుహాస్ కేబుల్ డిష్ ఓనర్ నటిస్తున్నట్లు సూచిస్తున్నాయి. పోస్టర్ లో 2000వ దశకం ప్రారంభంలో వాడిని చాలా పోర్టబుల్ టీవీలు  కనిపిస్తున్నాయి. సుహాస్ షేడ్స్‌ ధరించి చిరునవ్వుతో వాటిపై సేదతీరుతున్నట్లు కనిపించారు. సినిమా ఫన్ రైడ్ గా వుండబోతుందని హామీ ఇచ్చే పోస్టర్‌లో సుహాస్ ఎరుపు చొక్కా, నలుపు ఫార్మల్ ప్యాంట్‌లో సాధారణ గ్రామ యువకుడిగా కనిపించారు.

ఈ సినిమాలో సుహాస్‌కు జోడిగా షాలిని కొండేపూడి నటిస్తోంది. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మహి రెడ్డి పండుగుల్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మిగిలిన నటీనటులు, టెక్నికల్ టీం ను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News