Thursday, September 19, 2024

సుహాస్‌కు ‘జనక అయితే గనక’ యుఎస్‌ఎ రైట్స్

- Advertisement -
- Advertisement -

దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. సంగీర్తన హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఫైనల్ వెర్షన్‌ని చూసిన సుహాస్, యుఎస్‌ఏ హక్కులను సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ.. ‘ఫైనల్ వెర్షన్ చూశాను. చాలా బాగా నచ్చింది. వెంటనే యుఎస్‌ఏ హక్కులను తీసుకున్నాను. పక్కా ఎంటర్‌టైనింగ్ సినిమా ఇది. ప్రతి దానికీ లెక్కలు చెప్పే మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఈ సినిమాలో కనిపిస్తాను. ఈ సినిమా ప్రేక్షకులు పడీ పడీ నవ్వుకుంటారు. మా డైరక్టర్ చాలా మంచి సినిమా చేశారు. దిల్‌రాజు సపోర్ట్ చేసిన తీరు మర్చిపోలేం’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News