Friday, March 14, 2025

గోదావరి నదిలో దూకిన ఇరిగేషన్ డిఈఈ

- Advertisement -
- Advertisement -

 

నిజామాబాద్‌: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నీటి పారుదల శాఖ డీఈఈ గా పనిచేస్తున్న వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం నీటిలో తెలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నవీపేట్ మండలం పోతంగల్‌లో అదృశ్యమైనట్టు కుటుంబసభ్యులు నవీపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి బైక్‌పై వెళ్లిన అతను గోదావరి వద్ద బైక్‌ను వదిలివేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ నదిలో ఆయన మృతదేహం లభించడంతో.. వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతికిగల కారణాలు తెలియాల్సి ఉంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News