Monday, December 23, 2024

వాయువ్య పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: భద్రతా బలగానికి చెందిన 19 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

పెషావర్: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న వాయువ్య పాకిస్థాన్ గిరిజన జిల్లాలో శనివారం మోటారు సైకిల్‌పై పేలుడు పదార్థాన్ని కట్టుకుని వచ్చిన ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. దాంతో పాకిస్థాన్ భద్రతా బలగాలకు చెందిన కనీసం 19 మంది గాయపడ్డారని అధికారి తెలిపారు. ఖైబర్ ఫక్తూన్‌ఖ్వా లోని డిఐ ఖాన్ నుంచి దక్షిణ వజీరిస్థాన్‌లోని ఆస్మాన్ మంజా ప్రాంతంకు వెళుతున్న భద్రతా బలగాల వాహనంపై బాంబర్ దాడి చేశాడని బాంబ్ డిస్పోసల్ స్కాడ్ ఇన్‌ఛార్జీ ఇనాయతుల్లా టైగర్ తెలిపారు. భద్రతా బలగానికి చెందిన ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆయన తెలిపారు. ఆ మొత్తం ప్రాంతాన్ని దిగ్బంధించారు. దాడిపై నేర పరిశోధన సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News