కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ విద్యాకేంద్రంపై శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు వందమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా కథనం ప్రకారం ఈ దాడిలో అత్యధికంగా షియాలో మరణించారు. కాబూల్ నగరం పశ్చిమప్రాంతం దశత్ ఇ బార్చి ఏరియాలో కాజ్ విద్యాకేంద్రంలో ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు ధాటికి విద్యార్థుల శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయని కాజ్ ఉన్నత విద్యాకేంద్ర బోధన సిబ్బంది ఒకరు తెలిపారు. కాగా వెస్ట్ కాబూల్‌లోని షియాలు, హజారాలను లక్షంగా చేసుకుని హూఠైగదాడులు తరచుగా జరుగుతున్నాయి.
దాడిపై పోలీస్ అధికార ప్రతినిధి జార్డాన్ మాట్లాడుతూ పరీక్షకు సిద్ధమవుతుండగా ఆత్మాహుతి బాంబర్ ఒకరు వద్ద పేలుడుకు పాల్పడ్డాడు అని తెలిపారు. పరీక్ష సందర్భంగా క్లాస్‌రూమ్‌లో అధిక సంఖ్యలో విద్యార్థులు కిక్కిరిసి ఉండటంతో భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డారు. యూనివర్సిటీ మాక్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను పురస్కరించుకుని హాజరయ్యారు. ప్రాణాలు కోల్పోయినవారిలో విద్యార్థులతోపాటు విద్యార్థినులు కూడా ఉన్నారు. వీరంతా విద్యను పూర్తి చేసుకుని కాలేజీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న భద్రతా బలగాలు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించాయి. కాగా అఫ్గానిస్థాన్‌లో హజారాలు మూడో అతిపెద్ద సంప్రదాయక వర్గంగా ఉన్నారు.