Sunday, December 22, 2024

విమానం బాత్రూంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

- Advertisement -
- Advertisement -

ఓ విమాన ప్రయాణికుడు గాల్లో ప్రాణాలు తీసుకుందామనుకున్నాడు. విమానంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బ్యాంకాక్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో చోటుచేసుకుంది. తైవాన్ కు చెందిన ఇవా ఎయిర్ లెన్స్ విమానం గాలిలో ఉండగా బాత్ రూంలోకి వెళ్లిన వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బాత్ రూంలోకి వెళ్లిన వ్యక్తి ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది డోర్ ఓపెన్ చేసి చూడడంతో అతను కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. తక్షణమే స్పందించిన విమాన సిబ్బంది హిత్రూ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్నీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు బాధితుడిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News