- Advertisement -
డమాస్కస్ : సిరియా రాజధాని డమాస్కస్‌లో అధ్యక్ష భవనం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో సుసైడ్ బాంబర్‌తోపాటు మరో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ భవనం వద్దకు ఆత్మాహుతి దళ సభ్యుడు వచ్చాడు. అనుమానించిన భద్రతా సిబ్బంది అతడ్ని పట్టుకోడానికి ప్రయత్నించగా తప్పించుకుని తనకు తానుపేల్చి వేసుకున్నాడు. అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఇద్దరు భద్రతా సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనంతా వీడియోలో రికార్డయింది.
- Advertisement -