Thursday, January 16, 2025

వాయువ్య పాక్‌లో ఆత్మాహుతి బాంబు దాడి..8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్‌లోని కల్లోలిత ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రంలో ఒక పోలీస్ పికెట్ లక్షంగా శనివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో ఆరుగురు భద్రత విభాగం సిబ్బందితో సహా కనీసం ఎనిమిది మంది వ్యక్తులు మరణించగా పలువురు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఉత్తర వజీరిస్తాన్ గిరిజన జిల్లా మీర్ అలీ తెహసీల్‌లోని అస్లామ్ చెక్ పోస్ట్ వద్ద ఈ పేలుడు సంభవించినట్లు అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి. మూడు చక్రాల వాహనాలపై వచ్చిన బాంబర్లు చెక్ పోస్ట్‌ను, భద్రత దళాల వాహనాలనుఢీకొన్నారు.

ఈ సంఘటనలో నలుగురు పోలీస్ సిబ్బంది, ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు హతులయ్యారు. ఈ పేలుడులో ఇంకా అనేక మంది గాయపడగా, వారిని మీరాన్ షా ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని ఆ వర్గాలు సూచించాయి. తాలిబన్‌లు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి తిరిగి వచ్చిన తరువాత పాకిస్తాన్‌లో ఉగ్ర దాడుల పెరుగుదల కానవచ్చింది. ఆఫ్ఘన్ సరిహద్దును ఆనుకుని ఉన్న రాష్ట్రాలు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్‌లలో చాలా వరకు ఉగ్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News