Wednesday, January 22, 2025

అనారోగ్యంతో బాధపడుతూ ఉరివేసుకొని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి: అనారోగ్యంతో బాధపడుతున్న బైక్ మెకానిక్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం సురేష్ కుమార్ (47) చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని నెహ్రు నగర్ లో నివాసముంటు బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రాజేశ్వరి మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బైక్ మెకానిక్‌గా పని చేస్తున్న సురేష్‌కు గత కొంతకాలంగా నీరసంగా ఉండడం గమనించిన కుటుంభ సభ్యులు హస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ పరిశీలించగా అతనికి లివర్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిపారు.

హస్పిటల్‌లో మెడిసన్ తీసుకున్నా అనంతరం ఆగస్టు 17వ తేదిన మళ్లి యధావిధిగా పనికి వెళ్లాడు. కాగా సాయంత్రం 5.30 నిమిషాలకు ఇంటికి తిరిగి వచ్చిన సురేష్ తన కూతరుని స్కూల్ నుండి తీసుకొని రమ్మని భార్యకు చెప్పడంతో ఆమే స్కూల్‌కి వెల్లింది. తిరిగి సాయంత్రం 6.15 గంటల సమయంలో ఇంటికి రాగా బయట ఆమే అత్తతో మాట్లాడుతూ కూర్చోని మాట్లాడుతుండగా సురేష్ ఇంటి తలుపులు తీయడం లేదని సమాదానం చెప్పింది. తరువాత బెడ్‌రూంలోకి చూడగా సురేష్ ఉరివేసుకొని కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సురేష్‌ని ఉరినుండి కిందకి దించి దగ్గరలోని శ్రేయ హస్పిటల్‌కు తరలించారు. అక్కడ డ్యూటిలో ఉన్న డాక్టర్ అతన్ని పరిశీలించిన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు భార్య పిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాట్లు పోలిసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News