- Advertisement -
బోయిన్పల్లి: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కొడుకులతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే బలవన్మరణానికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. మృతులు తల్లి అనూష, కుమారులు గణ(03), మణి(18 నెలలు)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కుటుంబీకులను అదుపులోకి తీసుకుని విచారణిస్తున్నామని పోలీసులు తెలిపారు.
- Advertisement -