Tuesday, January 21, 2025

హైదర్‌గూడలో యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

తూప్రాన్: గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి కాపురానికి రాకపోవడంతో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఇంట్లో పురుగుల మందు తాగిఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని హైదర్‌గూడలో జరిగింది. తూప్రాన్ ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… పిట్ల శంకర్(35) అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనంసాగిస్తున్నాడు. ఇతనికి ఆరు సంవత్సరాల క్రితం మాచిన్‌పల్లికి చెందిన చంద్రకళతో పెళ్లయింది. ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. శంకర్ మద్యానికి బానిసై భార్యతో తరుచూ గొడవ పడేవాడు. అతను పెట్టే బాధలు భరించలేక రెండు నెలల క్రితం చంద్రకళ తనపుట్టింటికి వెళ్లిపోయింది. శంకర్ జీవితంపై విరక్తితో బుధవారం మద్యం మత్తులో ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగాడు.

అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు తూప్రాన్ ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తల్లి బాగ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News