Tuesday, January 21, 2025

ఆస్తి తగాదాలతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -
  • చందుర్తి మండలంలో విషాదం

చందుర్తి: చందుర్తి మండలం అసిరెడ్డిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. వృద్ద దంపతులు కనికరపు దేవయ్య, లక్ష్మినరసవ్వ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. గతేడాది నుండి ఈ దంపతులకు కొడుకులకు మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. దీంతో కొడుకు, కోడలు ఇంట్లోని కులదైవ విగ్రహాన్ని ఇంటి నుండి బయటకు తీసివేస్తామని అనడంతో మనస్థాపానికి గురయ్యారు.

ఇవన్నీ చూస్తూ తామింకా బతకలేమని ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చందుర్తి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారించగా రాత్రి సమయంలో కనికరపు దేవయ్య, లక్ష్మినరసవ్వ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్థారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి పంపించినట్లు చందుర్తి ఎస్‌ఐ సిరిసిల్ల అశోక్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News