Wednesday, January 22, 2025

నల్లగొండలో ఇద్దరు అన్నదమ్ముల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Suicide of two brothers in Nalgonda

 

మన తెలంగాణ, నల్గొండ క్రైమ్ : అప్పులు తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి నష్ట పోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక ఇద్దరు అన్నదమ్ములు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.టూటౌన్ ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ మండలంలోని పెద్ద సూరారం గ్రామానికి చెందిన మార్త శ్రీకాంత్(40) వెంకన్న (38) ఇద్దరు అన్నదమ్ములు నల్లగొండలోని ఫ్లైఓవర్ సమీపంలోని శ్రీనగర్ కాలనీలో నివాసముంటూ అన్నదమ్ములిద్దరూ తమ డబ్బులతో పాటు ఇతరుల వద్ద అధికంగా డబ్బులు తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. చివరికి ఆ వ్యాపారంలో నష్టం వాటిల్లడంతో అప్పు తెచ్చిన డబ్బులు తీర్చలేక అన్నదమ్ములిద్దరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయంత్రం సుమారు ఏడు గంటల పదిహేను (7.15)నిమిషాలకు వేర్వేరు రూమ్లలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకొని విచారణ చేపడుతున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల ఇద్దరికీ భార్య పిల్లలు ఉన్నారు.మృతుని భార్య పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News