Saturday, September 28, 2024

చచ్చేందుకు ‘సూసైడ్ పాడ్’ ?!

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ‘‘మీరు చావాలనుకుంటున్నారా, జస్ట్ బటన్ నొక్కండి’’ అని వినబడితే మీ జీవితం అంతే… అమెరికాలో వివాదాస్పద సర్కో ‘సూసైడ్ పాడ్’ లో ఓ అమెరికా వనిత దూరి తనను చంపుకుంది. పాడ్ లో జీవితం ముగించుకున్న తొలి వనిత ఆమె. ఎథిక్స్ మీద ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆ చనిపోయిన ఆమె ‘ఆటో ఇమ్యూన్ కండిషన్’ తో బాధపడుతూ చివరికి అలా జీవితాన్ని ముగించుకుంది. 64 ఏళ్ల ఆ వనిత చనిపోయేందుకు ప్రోత్సహించినందుకుగాను అనుమానం మీద అనేక మందిని అరెస్టు చేశారు.

ఎక్కడికంటే అక్కడి తీసుకెళ్ళగలిగే(పోర్టేబుల్) 3డి ప్రింటెడ్ పాడ్…దీనిని ‘టెస్లా ఆఫ్ యుథెన్సియా’ అంటున్నారు. దీనిని స్విస్-జర్మన్ సరిహద్దులో ఉంచారు. ఎందుకంటే చనిపోవాలనుకున్న ఆ వనిత చెట్లు, ఆకాశం చూస్తూ చనిపోవాలనుకుంది. అందుకే అక్కడ ఆమె చనిపోయిందని ‘డెయిలీ మెయిల్’ పేర్కంది. ఈ చచ్చే క్యాప్సుల్ ను తయారుచేసింది ఆస్ట్రేలియా డాక్టర్ ఫిలిప్ నిత్ ష్కే, అతడి నిక్ నేమ్ ‘డాక్టర్ డెత్’. ఆయన ‘యుథనేసియా క్యాంపెయిన్ ఎక్సిట్ ఇంటర్నేషనల్’ కు నిర్వాహకుడు కూడా.

ఈ డెత్ క్యాప్సుల్ లో బటన్ నొక్కిన వెంటనే 30 సెకండ్లలో చనిపోతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News