మిస్డ్ కాల్‌తో పరిచయానికి ఇద్దరు బలి
ఇద్దరిది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు….?
ప్రేమించుకున్న రాజేష్, సుజాత
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగర శివారులో మృతిచెందిన యువకుడి కేసులో పోలీసుల దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు యువకుడిని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాత భర్త హత్య చేసినట్లు భావించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే రాజేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు బయటికి వచ్చింది. ములుగు జిల్లా పంచోట్ కూలపల్లికి చెందిన అల్లెవుల రాజేష్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం నగరానికి వచ్చి స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు. హయత్‌నగర్ పిఎస్ పరిధికి చెందిన సుజాత ఓ రోజు మిస్డ్ కాల్ రాజేష్ నంబర్‌కు పొరపాటున రావడంతో ఇద్దరు మధ్య అప్పటి నుంచి పరిచయం ఏర్పడింది.
అప్పటి నుంచి ఇద్దరు వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకునేవారు. సుజాత దేవరకొండలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వాట్సాప్‌లో సుజాత డిపి చూసిన రాజేష్ వివాహం కాలేదని భావించి స్నేహం చేశాడు. ఆరు నెలల నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోవాలని ఇ్దదరు నిర్ణయించుకున్నారు. సూజాతతో కలిసి రాజేష్ ఆమె పనిచేసే దేవరకొండకు కూడా వెళ్లాడు. రెండు నెలల క్రితం సుజాతకు వివాహం అయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనే విషయం రాజేష్‌కు తెలిసింది. దీంతో ఆగ్రహం చెందిన రాజేష్ తనను మోసం చేశావని సుజాతను నిలదీశాడు. అప్పటి నుంచి సుజాతను దూరంపెట్టడం ప్రారంభించాడు. తనను దూరం పెట్టితే ఆత్మహత్య చేసుకుంటానని సుజాత, రాజేష్‌ను బెదిరించింది.
ఈ క్రమంలోనే ఈనెల 24వ తేదీన సుజాత క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం తెలియని రాజేష్ ఆమె మొబైల్‌కు మెసేజ్‌లు పంపిస్తున్నాడు. సుజాత మొబైల్ ఆమె కూతురి వద్ద ఉండడంతో వాటిని చూసింది. తాను టీ షాపు వద్ద ఉ న్నానని చెప్పడంతో సుజాత కుమారుడు, తన స్నేహితుడితో కలిసి వెళ్లి కొట్టాడు. తర్వాత సుజాత పరిస్థితి విషమంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు రాజేష్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. అయితే చికిత్స పొందుతూ సు జాత మృతి చెందింది. ఇది తనపై వస్తుందని భయపడిన రాజేష్ వెంచర్‌లోకి వెళ్లి క్రిమిసంహారక మందు తాగి ఆ త్మహత్య చేసుకున్నాడు. మృతదేహం పక్కన మొబైల్ ఆ ధారంగా పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకున్నారు.
నా భార్య అమాయకురాలు:నాగేశ్వరరావు, సుజాత భర్త
తన భార్య సుజాత మృతిపై విచారణ జరపాలని ఆమె భర్త నాగేశ్వరరావు కోరారు. తన భార్య అమాయకురాలని ఆవేదన వ్యక్తం చేశారు.