2015 ఏడాదిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (పీఎం నరేంద్ర మోదీ) బేటీ పఢావో బేటీ బచావో ప్రచారం కింద సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించిన విషయం అందరికి తెల్సిందే. కాగా, ఈ పథకం చిన్న పొదుపు పథకంలో చేర్చబడింది. ఈ పథకంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ కుమార్తెల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడతారు. పెట్టుబడి మొత్తంపై ప్రభుత్వం అధిక వడ్డీ ఇస్తుంది. కుమార్తెకు 21 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఈ పథకం పరిపక్వం చెందుతుంది. అంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఈ పథకం ద్వారా మీ కూతురు కూడా లక్షాధికారి కావచ్చు.
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
కొత్త నిబంధనల (SSY కొత్త రూల్) ప్రకారం..తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు మాత్రమే సుకన్య ఖాతాను ఆపరేట్ చేయగలరు. ఒకవేళ మీ కుమార్తె సుకన్య ఖాతాను చట్టపరమైన సంరక్షకుడు కాని వ్యక్తి తెరిచి ఉంటే..మీరు వీలైనంత త్వరగా ఖాతాను బదిలీ చేయాలి. అలా ఖాతాను బదిలీ చేయకపోతే..ఖాతా మూసివేయబడవచ్చు. కాగా, ఈ పథకం యొక్క కొత్త నియమాలు 1 అక్టోబర్ 2024 నుండి అంటే వచ్చే నెల నుండి అమలులోకి వస్తుందని తెలుస్తోంది.