Sunday, February 2, 2025

పవర్‌లిఫ్టింగ్‌లో సుకన్యకు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన తేజావత్ సుకన్యకు స్వర్ణ పతకం లభించింది. దక్షిణాఫ్రికా వేదికగా ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పవర్‌లిఫ్టర్లు పోటీపడుతున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన సుకన్య మహిళల 76 కిలోల విభాగంలో పసిడి పతకాన్ని గెలుచుకుంది. కోచ్ రాజశేఖర్ పర్యవేక్షణలో సుకన్య జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మెరుగైన ప్రదర్శనను కనబరుస్తోంది. రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన సుకన్య అసాధారణ ప్రతిభతో పలు టోర్నమెంట్‌లలో పతకాలను సొంతం చేసుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News