మనీలాండరింగ్, పలువురిని మోసగించారన్న ఆరోపణలపై మండోలీ జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ కేరళలోని వయనాడ్‌లో ఇటీవల కొండ చరియలు విరిగిపడి వందలాది మంది మరణించిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒక లేఖ రాశారు. వయనాడ్ బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి తాను పంపుతున్న రూ. 15 కోట్ల విరాళాన్ని స్వీకరించాలని ఆ లేఖలో ఆయన కోరారు. అంతేగాక వయనాడ్ బాధితుల కోసం తాను 300 ఇళ్లను వెంటనే నిర్మించడానికి సిద్ధమని కూడా ఆ లేఖలో ఆయన తెలియచేశారు. కేరళలో జరిగిన ఘోర విపత్తును చూసి తీవ్రంగా కలత చెందానని, ఈ విపత్కర పరిస్థితులలో ఆదుకోవాలని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ లేఖను చంద్రశేఖర్ రాసినట్లు ఆయన న్యావాది అనంత్ మాలిక్ ధ్రువీకరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తన ఫౌండేషన్ నేడు పంపుతున్న రూ. 15 కోట్ల విరాళాన్ని స్వీకరించాలని ఆ లేఖలో ఆయన ముఖ్యమంత్రిని అర్థించారు. ఇదిగాక 300 ఇళ్ల నిర్మాణానికి తాను ఆర్థిక సహాయం అందచేస్తానని ఆయన ప్రకటించారు. తాను ఈ విరాళాన్ని తన చట్టబద్ధమైన వ్యాపార ఖాతాల నుంచి అందచేస్తున్నానని ఆయన ఆ లేఖలో తెలిపారు. చంద్రశేఖర్ లేఖపై కేరళ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. మనీ లాండరింగ్, ప్రజలను మోసం చేశారన్న ఆరోపణలపై సుకేష్ చంద్రశేఖర్, ఆయన భార్య ప్రస్తుతం జైలులో ఉన్నారు.
ఆ