Tuesday, January 7, 2025

సుఖ్ బీర్ బాదల్ కు పారిశుద్ధ్య పనిని శిక్షగా విధించిన అకాల్ తక్త్

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: 2015లో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు అనుకూలంగా వ్యవహరించినందుకు అకాల్ తఖ్త్, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ బాదల్‌కు అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌తో సహా పలు గురుద్వారాలలో వంటగది , బాత్‌రూమ్‌లలో శుభ్రపరిచే విధిని విధించింది. అతని తండ్రి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ప్రకాష్ సింగ్ బాదల్, సమాజానికి చేసిన సేవలకు గాను 2011లో అతనికి ఇచ్చిన ఫఖర్-ఎ-కౌమ్ (సిక్కు సమాజానికి గర్వకారణం) గౌరవాన్ని కూడా తొలగించారు.

వీల్‌చైర్‌లో ఉన్న ఉఖ్‌బీర్ బాదల్, ప్రధాన కమిటీ సభ్యులు,2015లో క్యాబినెట్ సభ్యులుగా ఉన్న అకాలీదళ్ నాయకులు డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంటల వరకు అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో బాత్‌రూమ్‌లను శుభ్రం చేస్తారు. ఆ తర్వాత స్నానం చేసి లంగర్ వడ్డిస్తారు. బాదల్ తన తప్పులను అంగీకరించాక, అకాల్ తఖ్త్‌ కు బేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాత ఈ శిక్ష విధించారు.

2007లో గుర్మీత్ రామ్ రహీమ్ సిక్కు గురువుల మాదిరిగానే దుస్తులు ధరించి వేడుకను నిర్వహించాడు, అందుకుగాను అకల్ తఖ్త్ నుంచి బహిష్కరించబడ్డాడు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తన ప్రభావాన్ని ఉపయోగించి డేరా చీఫ్‌కు క్షమాభిక్ష ప్రసాదించారని ఆరోపణ.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News