Monday, December 23, 2024

హిమాచల్‌ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి కానున్న సుఖ్‌వీందర్ సింగ్ సుఖు

- Advertisement -
- Advertisement -
త్వరలో వెలువడనున్న ప్రకటన

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఎవరు ముఖ్యమంత్రి కానున్నారన్న సస్పెన్స్‌కు తెరపడినట్లే. హిమాచల్ కాంగ్రెస్ ప్రచారక కమిటీ చీఫ్ సుఖ్‌వీందర్ సింగ్ సుఖు ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి కానున్నట్లు సమాచారం. ఎంఎల్‌ఏల నుంచి సమాచారం సేకరించిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయన పేరును క్లియర్ చేసినట్లు వినికిడి. అభిజ్ఞ వర్గాల సమాచారం మేరకు సుఖ్‌వీందర్ సింగ్ సుఖు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

హిమాచల్‌ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది మరికొన్ని నిమిషాలలో… సిమ్లాలో జరిగే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత వెలువడనున్నది. నదౌన్ ఎంఎల్‌ఏ సుఖ్‌వీందర్ సుఖుకు మెజారిటీ ఎంఎల్‌ఏలు మద్దతు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ ప్రచారక కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 68 సీట్లలో 40 సీట్లు గెలుచుకుంది. దాంతో బిజెపిని వెనక్కి నెట్టేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News