- Advertisement -
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. గోగుండా కొండపై భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 15 మంది మావోలు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఆపరేషన్ లో డిఆర్ జి, సిఆర్ పిఎఫ్ జవాన్లు పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి భారీగా మందు గుండు సామాగ్రి, ఎకె 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.
- Advertisement -