Tuesday, April 1, 2025

నెత్తురోడిన బస్తర్

- Advertisement -
- Advertisement -

సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో రెండు భారీ ఎన్‌కౌంటర్లు, 18 మంది మావోయిస్టుల మృతి
మృతుల్లో 11 మంది మహిళా మావోయిస్టులు, ఇద్దరు జవాన్లకు గాయాలు n బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మృతి
మావోలు నదిలో అమర్చిన ఐఇడి బాంబు పేలుడు ఘటన, ఒక మహిళ మృతి, మరొక మహిళకు తీవ్ర గాయాలు
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తాం, ఎక్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్

మన తెలంగాణ/చర్ల: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం వరుస ఎదురుకాల్పులతో నెత్తురోడింది. సుక్మా, దంతేవాడ జిల్లాల సరిహద్దులోని ఊపంపల్లి అడవుల్లో శనివారం ఉదయం జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టు లు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డా రు. మృతి చెందిన వారిలో 11 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. సుక్మా జిల్లా అడవుల్లో భారీ ఎత్తున మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల పక్కా సమాచారంతో డిఆర్‌జి, సిఆర్‌పిఎఫ్ సంయుక్త బృందాలను అటవీ ప్రాంతాలకు ఆపరేషన్ కోసం పంపించారు. ఈ క్రమంలో ఊపంపల్లి అడవుల్లో ఉదయం 8 గంటల నుంచి బలగాలు, మావోయిస్టుల మధ్య బీకర ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల అనంతరం సె ర్చింగ్ ఆపరేషన్ నిర్వహించగా 16 మంది మా వోయిస్టుల మృతదేహాలను భద్రత బలగాలు స్వా ధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతం నుంచి ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్, 303 రైఫిళ్లతో పాటు డిజైన్ లాంచ, బిజిఎల్ లాంచర్లు, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నా యి. ఈ ఎదురుకాల్పుల్లో ఎస్‌జెడ్‌సి (స్పెషల్ జోనల్ కమిటీ) సభ్యుడు జగదీశ్ అలియాస్ బుద్ర హతమయ్యాడు. ఇతని తలపై రూ.25 లక్ష లు రివార్డు ఉన్నట్లు ఎస్‌పి కిరణ్ చవాన్ వెల్లడించారు. మృతదేహాలను 10 కిలోమీటర్ల మేర భద్ర త బలగాలు మోసుకొచ్చాయి.

ఎదురుకాల్పుల ఘటనను బస్తర్ ఐజి సుందర్ రాజ్ పి ధృవీకరించారు. ఇదిలావుండగా, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న మావోయిస్టు మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు దంతేవాడ డిఐజి కమలోచన్ కశ్యప్ వెల్లడించారు. కాగా, సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వచ్చే యేడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని పునరుద్ఘాటించారు.

బీజాపూర్ జిల్లాలో మావోల దుశ్చర్య

భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధి, ఉసుపరి గ్రామంలోని నదిలో ఐఇడి భద్రాతా బలగాలను లక్ష్యం గా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలిన ఘటనలో గ్రామానికి చెందిన ఒక మహిళ మృతి చెందగా, మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని చికిత్స కోసం భైరంగఢ్ తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News