Thursday, January 23, 2025

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అప్పు ఇచ్చిన వారి వేధింపులకు ఉరివేసుకున్న బాధితుడు

మనతెలంగాణ, సిటిబ్యూరో: అప్పుల బాధ తాలలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సులేమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ నబీ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి కుమారుడు ఎండి తౌఫిక్(25) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తౌఫిక్ అవసరాల కోసం ఎండి వాహీద్ పాషా వద్ద రూ.65,000 అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి చెల్లించాలని తౌఫిక్‌పై ఒత్తిడి తీసుకుని రావడంతో తట్టుకోలేక బాధితుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రిలో ఉంచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అత్తాపూర్ ఇన్స్‌స్పెక్టర్ యాదగిరి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News