Monday, December 23, 2024

ముస్లిం మహిళలను టార్గెట్ చేస్తూ సల్లీ డీల్స్ గ్రూప్ ట్విటర్ దుర్వినియోగం

- Advertisement -
- Advertisement -

Sulli Deals group misused 30 Twitter handles

ప్రధాన నిందితుడు ఠాకూర్ అరెస్టు నేపథ్యంలో మిగతా నిందితుల గుర్తింపునకు యత్నం

ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో తేలిన వాస్తవాలు

న్యూఢిల్లీ : వేలం ఉద్దేశ్యంతో మార్ఫింగ్ చేసిన ముస్లిం మహిళల ఫోటోలను అప్‌లోడ్ చేసుకోడానికి 30 ట్విటర్ ఖాతాలను సల్లీడీల్స్ గ్రూప్ సభ్యులు దుర్వినియోగం చేశారని దర్యాప్తులో తేలిందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన యాప్ రూపకర్త 26 ఏళ్ల ఓంకారేశ్వర్ ఠాకూర్‌ను మధ్యప్రదేశ్ ఇండోర్‌లో శనివారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సల్లీడీల్స్ గ్రూప్‌కు చెందిన సభ్యులను గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఠాకూర్ తన లాప్‌టాప్‌లో సమాచారాన్ని తొలగించివేసినట్టు కనుగొన్నారు. అతని లాప్‌టాప్‌ను, ఫోన్ల తోపాటు బుల్లి బయ్ రూపకర్త నీరజ్ వైష్ణవ్ లాప్‌టాప్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీటిని నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరిశీలన కోసం పంపారు. అక్కడి నుంచి నివేదిక వచ్చే లోగా మిగతా నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. విచారణలో ఠాకూర్ తాను స్వంతంగా నడుపుతున్న వెబ్‌డిజైనింగ్ సంస్థకు అమెరికా నుంచి కూడా తనకు ఖాతాదారులు ఉన్నారని చెప్పినట్టు పోలీసులు వివరించారు. ఠాకూర్ తండ్రిని ప్రశ్నించగా పగలంతా నిద్రిస్తుంటాడని, రాత్రంతా పనిచేస్తుంటాడని ఇదేమిటని అడగ్గా, భారత్‌కు, అమెరికాకు వేళల్లో తేడా ఉంటుందని , అందువల్ల రాత్రుళ్లు పనిచేయవలసి వస్తుందని ఠాకూర్ చెప్పినట్టు తల్లిదండ్రులు వివరించారు. ఠాకూర్, వైష్ణవ్ ఉభయులూ తమ కార్యకలాపాలకు ఏమాత్రం చింతించడం లేదని, అయితే తమ వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతారని విలపించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News