Monday, December 23, 2024

ప్రియుడ్ని కట్టేసి… ప్రియురాలిపై స్నేహితుడు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రియుడ్ని కట్టేసి ప్రియురాలిపై అతడు స్నేహితుడు అత్యాచారం చేసిన సంఘటన తిరుపతి జిల్లా సూళ్లూరు పేట మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…శ్రీ పోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువతి, యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తూ సహజీవనం సాగిస్తున్నారు. సదరు యువకుడికి ఏడుమలై, బాలాజీ అనే స్నేహితులు ఉన్నారు. మంగళవారం ఉదయం ఏడుమలైతో కలిసి సదరు యువకుడు మద్యం తాగాడు.

అనంతరం రాత్రి ఏడు గంటల సమయంలో యువకుడికి ఏడుమలై ఫోన్ చేసి ప్రియురాలి బర్త్ డే ఉందని చెప్పావు కదా కొరిడి శివాలయం వద్ద పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకుందామని కబురు పంపాడు.కంపెనీకి వెళ్లిన ప్రియురాలు కోసం సూళ్లూరు పేట జంక్షన్ వద్ద ప్రియుడు వేచి చూస్తున్నాడు. అదే సమయంలో బాలాజీ, ఏడుమలై అక్కడికి రావడంతో అందరూ కలిసి బయలుదేరారు. పులికాట్ తీరంలోకి రాగానే సదరు యువకుడి చొక్కా విప్పి స్నేహితులు కట్టేశారు. యువకుడిని బాలాజీ పట్టుకోగా యువతిని ఏడుమలై బెదిరించి అత్యాచారం చేశాడు. ప్రియుడు, ప్రియురాలు వద్ద నగదు, సెల్‌ఫోన్ లాక్కొని ఇద్దరు పారిపోయారు. వెంటనే ప్రేమజంట స్థానిక శ్రీహరికోట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News