Monday, December 23, 2024

యువతిపై గ్యాంగ్‌రేప్…. చికిత్స పొందుతూ మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: యువతిపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బహ్రీ గ్రామానికి చెందిన మహావీర్ అనే యువకుడు జైసింగ్‌పూర్‌కు చెందిన విద్యార్థిని తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసి గుజరాత్‌లోని సూరత్‌కు తీసుకెళ్లారు.

Also Read: కాన్పుల్లో రికార్డ్

మార్చి 28న యువతిపై మహావీర్ తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఎదురుతిరగడంతో ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ విషయాన్ని ఆమె తండ్రిని నిందితుడు ఫోన్ చేసి చెప్పడంతో తండ్రి ఎస్‌పి కలిసి ఫిర్యాదు చేశాడు. పోలీసులు సూరత్‌కు చేరుకొని ఆమె లక్నోలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 60 శాతం కాలిన గాయాలతో ఇబ్బంది పడుతూ చికిత్స తీసుకుంటూ మంగళవారం చనిపోయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News