Friday, December 20, 2024

పొలంలో పని చేస్తుండగా రైతులపై కాల్పులు… ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఇద్దరు రైతులు పొలంలో పని చేస్తుండగా కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సూల్తాన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మార్య క్రిష్ణదాస్‌పూర్ గ్రామంలో ధర్మరాజ్ మౌర్య(60), విజయ్ కుమార్ రాజ్‌భర్(45) అనే రైతులు తన పొలంలో పనిచేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరపడంతో కిందపడిపోయారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఇద్దరు రైతులు చనిపోయారని తెలిపారు. ఇద్దరు రైతుల శత్రువులు ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: పేకాటలో రూ.300 కోసం చంపేశారు…

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News