Wednesday, January 22, 2025

సుమ చాలా ప్రతిభావంతురాలు

- Advertisement -
- Advertisement -

Suma act in jayamma panchayathi

పాపులర్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ విడుదలకు సిద్ధమైంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ సినిమా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు మీడియాతో మాట్లాడుతూ “-జయమ్మ పంచాయితీ… ఒక పొటెన్షియల్ స్క్రిప్ట్ గా వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. అంతలా టాప్ టివి యాంకర్ సుమ కూడా అందులో చేరింది. ఎంఎం కీరవాణి లాంటి సంగీత దర్శకుడు స్వరాలు సమకూర్చారు.

సినిమాను ఫ్లోర్స్ కి తీసుకెళ్లడానికి ముందు ఒక నెల పాటు నటీనటులతో వర్క్‌షాప్ చేశాం. – గత కొన్ని వారాలుగా పవన్ కళ్యాణ్, రాజమౌళి, త్రివిక్రమ్ వంటి వారు మా సినిమాకు ప్రమోషన్ ఇవ్వడం నేను ఊహించలేనిది. జయమ్మ పాత్రలో రమ్యకృష్ణ వంటి నటి అయితే బాగుంటుంది అనుకున్నా. అయితే వారిని ఇప్పటికే భిన్నమైన పాత్రల్లో చూశాం. సుమ పేరు ఎవరో సూచించడంతో ఆమె దగ్గరకు వెళ్లాను. కథాంశం ఆమెకు నచ్చింది. – సుమ చాలా ప్రతిభావంతురాలు. ఆమె ‘బ్రేకింగ్ బాడ్’ వంటి వెబ్ షోలలో నటుల ప్రదర్శనలలోని చిన్న చిన్న అంశాలను కూడా గమనిస్తుంది. అప్పుడే సుమపై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆమె నా షార్ట్ ఫిలిమ్స్ చూసింది. కీరవాణి బాణీలు చేయడంతో సినిమా విజయంపై మరింత నమ్మకం ఏర్పడింది. ‘జయమ్మ పంచాయతీ’ కథను నిజమైన వ్యక్తుల నుండి ప్రేరణ పొంది రాశాను. నా జీవితంలో నేను కలిసిన వ్యక్తులను నేను నాటకీయంగా చూపించాను. ఇది కల్పిత కథ అయినప్పటికీ కొన్ని సన్నివేశాలను వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News