Monday, December 23, 2024

మీడియా వారు అలా తింటారని కామెంట్…. సుమ క్షమాపణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాంకర్ సుమ మీడియాకు క్షమాపణలు చెప్పారు. తాను ఒక ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలను ఆమె క్షమించాలని మీడియా మిత్రులను కోరారు. మీడియాలో తనని ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని కోరారు. ఆదికేశవ మూవీలో లీలమ్మో పాట విడుదల సందర్భంగా సుమ యాంకరింగ్ చేశారు.

మీడియా వారు స్నాక్స్‌ను భోజనంలా తింటారని కామెంట్లు చేయడంతో ఓ విలేకరి అలా అనకూడదని సూచించారు. మీడియా మిత్రులతో ఉన్న చనువుతో అలా మాట్లాడనని జవాబు ఇచ్చారు. తరువాత తప్పు సరిదిద్దుకొని స్నాక్స్‌ను స్నాక్స్‌లాగే తింటారని వివరణ ఇవ్వడంతో పాటు ఇలా మాట్లాడటం ఇష్టమేనా అని మీడియా మిత్రులను అడిగారు. మీడియా గురించి మాట్లాడవద్దని సుమను ఘాటుగా విలేకర్లు హెచ్చరించడంతో ఆమె వేదికపై నుంచి క్షమాపణలు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News