Wednesday, January 22, 2025

విలేజ్ డ్రామా వినోదాత్మకంగా..

- Advertisement -
- Advertisement -

Mahesh Babu

సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మాణంలో దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సుమ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ “ఛాలెంజ్‌గా తీసుకొని ఈ సినిమా చేశాను. ఈ సినిమా కథను రమ్యకృష్ణ, అనుష్క వంటి వారిని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారు. చివరికి నా దగ్గరకు రావడం, పెద్ద నిడివి ఉన్న పాత్ర కావడంతో గొప్పగా ఫీలయ్యాను. ఇక ఈ సినిమాలో విలేజ్ డ్రామా వినోదాత్మకంగా ఉంటుంది. ఈ సినిమా ‘కేరాఫ్ కంచెరపాలెం’ తరహాలో ఉంటుంది. కథనంలోనే పాత్రల ద్వారా ఫన్ వస్తుంది. ఇక మా అబ్బాయి రోషన్‌కు చిన్నతనం నుంచి నటుడు కావాలనే కోరిక ఉంది. త్వరలో హీరోగా రోషన్ ఓ సినిమా చేయబోతున్నాడు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News