Thursday, January 23, 2025

బిజెపిలో చేరిన మాండ్య ఎంపీ సుమలత అంబరీశ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు:  సీనియర్‌ నటి, మాండ్య నియోజ‌క‌వ‌ర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీ సుమ‌ల‌త అంబ‌రీశ్  భారతీయ జనతా పార్టీలో చేరారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం ఉదయం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. తాను బిజిపిలో చేరనున్నట్లు ఇటీవలే సుమలత ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ, జెడిఎస్ ద‌ళానికి స‌పోర్టు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మాండ్యాను తాను విడిచిపెట్టడం లేద‌ని, రాబోయే రోజుల్లో మీకోసం నేను ప‌నిచేయ‌డం చూస్తార‌ని, బిజెపిలో చేర‌డానికి డిసైడ్ అయిన‌ట్లు సుమ‌ల‌త తెలిపారు.  2019 నాటి ఎన్నిక‌ల్లో బిజెపి మ‌ద్దతుతో కుమార‌స్వామి కుమారుడు నిఖిల్‌పై సుమ‌ల‌త విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

సీట్ షేరింగ్ ఫార్ములా ప్రకారం.. క‌ర్నాట‌క‌లో బిజెపి 25 స్థానాల్లో పోటీ చేయ‌నున్నది. జెడీఎస్ మూడు చోట్ల పోటీ చేస్తుంది. ఈసారి మాండ్య నుంచి జెడీఎస్ పోటీలో నిల‌బ‌డ‌నున్నది. తాను స్వతంత్య్ర ఎంపీగా ఉన్నా.. కేంద్రంలోని బిజెపి స‌ర్కారు మాండ్య లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి 4 వేల కోట్ల నిధుల్ని రిలీజ్ చేసిన‌ట్లు సుమ‌ల‌త వెల్లడించారు. బిజెపి నుంచి రాజ్యస‌భ‌కు సుమల‌త వెళ్లే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News